Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 6

Release Notes

Red Hat Enterprise Linux 6.3 కొరకు విడుదల నోట్స్

Edition 3


Legal Notice

Copyright © 2012 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

Abstract
Red Hat Enterprise Linux 6.3 నందు అభివృద్ది చేసిన మెరుగుదలలు మరియు చేరికల గురించి విడుదల నోట్స్ అధిక స్థాయిలో వివరణను అందించును. Red Hat Enterprise Linux 6.3 నవీకరణకు గల అన్ని మార్పులపై విశదీకృత పత్రికీకరణ కొరకు, సాంకేతిక నోట్స్ చూడండి.

ముందుమాట
1. కెర్నల్
2. పరికర డ్రైవర్లు
3. నెట్వర్కింగ్
4. వనరు(రిసోర్స్) నిర్వహణ
5. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి
6. ఎన్‌టైటిల్‌మెంట్
7. వర్చ్యులైజేషన్
7.1. KVM
7.2. SPICE
7.3. libvirt
8. క్లస్టరింగ్ మరియు అదిక అందుబాటు
9. నిల్వ
10. సాధారణ నవీకరణలు
A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

ముందుమాట

Red Hat Enterprise Linux వుప విడుదలలు అనునవి, పొడిగింపుల, రక్షణ మరియు బగ్ పరిష్కారాల యెర్రాటా యొక్క సమాహారం. Red Hat Enterprise Linux 6.3 విడుదల నోట్స్ నందు Red Hat Enterprise Linux 6 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దాని అనువర్తనములకు యీ వుపవిడుదల నందు జరిగిన ముఖ్య మార్పులను పత్రకీకరణచేయును. ఈ వుప విడుదల నందు జరిగిన అన్ని మార్పులపై విశదీకృత వివరణ సాంకేతిక నోట్స్ నందు వుంది. సాంకేతిక నోట్స్ పత్రికీకరణ అనునది ప్రస్తుతం అందుబాటులో వున్న సాంకేతిక మునుజూపులను వాటిని అందించే ప్యాకేజీలతో సహా కలిగివుంటుంది.

ముఖ్యమైన

ఆన్‌లైన్ Red Hat Enterprise Linux 6.3 Release Notes, ఏవైతే యిక్కడ ఆన్‌లైన్ నందు వున్నాయో, వాటిని ఖచ్చితమైన, తాజా వర్షన్‌గా పరిగణించాలి. విడుదల గురించి వినియోగదారులకు గల ప్రశ్నల కొరకు వారు ఆన్‌లైన్ నందు విడుదల మరియు సాంకేతిక నోట్స్ వద్ద వారి Red Hat Enterprise Linux వర్షన్‌కు సంభందించి సంప్రదించవచ్చు.
Red Hat Enterprise Linux పరిణామ చక్రం గురించి మీకు సమాచారం కావలెనంటే, https://access.redhat.com/support/policy/updates/errata/ చూడండి.

Chapter 1. కెర్నల్

తిన్-ప్రొవిజనింగ్ మరియు స్కేలబుల్ స్నాప్‌షాట్ సామర్ధ్యాలు
dm-thinp లక్ష్యాలు, thin మరియు thin-pool, తిన్-ప్రొవిజనింగ్ మరియు స్కేలబుల్ స్నాప్‌షాట్ సామర్ధ్యాలతో డివైజ్-మాపర్ పరికరం అందించును. ఈ విశేషణం సాంకేతిక మునుజూపువలె అందుబాటులో వుంటుంది. కొత్తగా పరిచయం చేసిన LVM తిన్ ప్రొవిజనింగ్ పై మరింత సమాచారం కొరకు Chapter 9, నిల్వ చూడండి.
sysfs mbox యింటర్ఫేస్ నిలిపివేయబడింది
lpfc డ్రైవర్ sysfs mbox యింటర్ఫేస్‌ను తీసివేస్తోంది అది Emulex సాధనాలచే వుపయోగించబడని కారణంగా. చదువుట మరియు వ్రాయుట అను చర్యలు తీసివేయబడ్డాయి మరియు -EPERM (ఆపరేషన్ అనుమతించబడదు) చిహ్నాన్ని యిస్తోంది.
తోడ్పాటునిచ్చు Kdump లక్ష్యాలు
తోడ్పాటునిచ్చు kdump లక్ష్యాల పూర్తి జాబితా కొరకు (అనగా, vmcore డంప్ చేయుటకు kdump వుపయోగించగల లక్ష్యాలు), కింది Kbase వ్యాసం చూడండి: https://access.redhat.com/knowledge/articles/41534.
అదనపు మౌంట్ ఐచ్చికాల కొరకు తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.3 అనునది /proc/<PID>/ డైరెక్టరీలకు యాక్సెస్‌ను నిర్భందించుటకు మౌంట్ ఐచ్ఛికాలకు తోడ్పాటు జతచేయును. కొత్త ఐచ్ఛికాలలో వొకటి hidepid= మరియు దాని విలువ అనునది యజమానులు-కాని వాటికి ప్రోసెసెస్ గురించి యెంత సమాచారం అందించాలి అనేది నిర్వచించును. gid= ఐచ్ఛికం అనునది అన్ని ప్రోసెసెస్ గురించిన సమాచారం సేకరించే వొక సమూహం నిర్వచించును. నమ్మదగని వాడుకరులు, యేవైతే మొత్తం వ్యవస్థలో కర్తవ్యాలను పర్యవేక్షించకూడదో, అవి సమూహంనందు జతచేయకూడదు.
O_DIRECT ఫ్లాగ్ తోడ్పాటు
O_DIRECT ఫ్లాగ్ కొరకు తోడ్పాటు FUSE (File system in Userspace) నందలి ఫైళ్ళ కొరకు జతచేయబడెను. ఈ ఫ్లాగ్ అనునది ఫైలు నుండి I/O యొక్క క్యాచీ ప్రభావాలను తగ్గించును. సాధారణంగా, యీ ఫ్లాగ్‌ను వుపయోగించుట పనితనంను తగ్గించును, అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో వుపయోగకరంగా వుంటుంది, అనగా అనువర్తనాలు వాటి స్వంత క్యాచింగ్ చేయునప్పుడు.
CONFIG_STRICT_DEVMEM అనునది PowerPC పై చేతనమైను
Red Hat Enterprise Linux 6.3 నందు, CONFIG_STRICT_DEVMEM ఆకృతీకరణ ఐచ్ఛికం అనునది అప్రమేయంగా PowerPC ఆకృతికొరకు చేతనంచేయబడును. ఈ ఐచ్ఛికం అనునది /dev/mem పరికరముకు యాక్సెస్ నిర్భందం చేయును. ఈ ఐచ్ఛికం అచేతనమైతే, మొత్తం మెమొరీకు యూజర్‌స్పేస్ యాక్సెస్ అనుమతించబడును, కెర్నల్ మరియు యూజర్‌స్పేస్ మెమొరీతో సహా, మరియు ప్రమాదపు మెమొరీ (వ్రాయు) యాక్సెస్ కూడా హానికారకం కాగలదు.
CONFIG_HPET_MMAP చేతనమైను
Red Hat Enterprise Linux 6.3 నందు, HPET రిజిస్టర్సును వాడుకరి ప్రోసెస్ యొక్క మెమొరీ లోనికి రీమాప్ చేయుటకు హై-రిజొల్యూషన్ టైమర్ యొక్క సామర్ధ్యం చేతనంచేయబడింది.
పెద్ద వ్యవస్థలపై మెరుగైన పనితనం
Red Hat Enterprise Linux 6.3 నందు చాలా ప్యాచెస్ కెర్నల్‌కు వర్తించబడెను మొత్తం పనితనం మెరుగుపరచుటకు మరియు మరీ పెద్ద వ్యవస్థలపై బూట్ సమయం తగ్గించుటకు (ప్యాచెస్ 2048 కోర్స్ మరియు 16 TB మెమొరీ వున్న వ్యవస్థలపై పరీక్షించబడెను).
rdrand కెర్నల్ తోడ్పాటు
Intel Core i5 మరియు i7 ప్రోసెసర్లు (formerly code-named Ivy Bridge) అనునవి త్వరితంగా యాదృశ్చిక సంఖ్యలను జనియింపచేయుటకు కొత్త rdrand సూచనను తోడ్పాటునిచ్చును. Red Hat Enterprise Linux 6.3 నందు అందించబడు కెర్నల్ త్వరిత యాదృశ్చిక సంఖ్యా వుత్పాదనకు యీ సూచనను వుపయోగించును.
స్థిరమైన నిల్వకు UEFI తోడ్పాటు
స్థిరమైన నిల్వ (pstore), ప్లాట్‌ఫాం ఆదారిత స్థిరమైన నిల్వ కొరకు వొక ఫైల్ వ్యవస్థ, యిప్పుడు UEFI తోడ్పాటు నిచ్చును.
CPU ఫ్యామిలీ స్పెసిఫిక్ కంటైనర్ ఫైళ్ళు
CPU ఫ్యామిలీ స్పెసిఫిక్ కంటైనర్ ఫైళ్ళ కొరకు తోడ్పాటు జతచేయబడెను. AMD ఫ్యామిలీ 15h ప్రోసెసర్లతో ప్రారంభించి, microcode_amd_fam15h.bin వంటి కంటైనర్ యిప్పుడు ముందుచెప్పబడిన ప్రోసెసర్ల కొరకు లోడైనది.
USB 3.0 తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.3 పూర్తి USB 3.0 తోడ్పాటు చేర్చును.
IBM System z కొరకు kdump/kexec కెర్నల్ డంపింగ్ మెకానిజం
Red Hat Enterprise Linux 6.3 నందు, kdump/kexec కెర్నల్ డంపింగ్ మెకానిజం అనునది IBM System z వ్యవస్థల కొరకు చేతనంచేయబడెను, IBM System z స్టాండ్-యెలోన్ మరియు హైపర్విజర్ డంపింగ్ మెకానిజంకు అదనంగా. ఆటో-రిజర్వ్ త్రెష్‌హోల్డ్ అనునది 4 Gb వద్ద అమర్చబడెను; కనుక, 4 GB మెమొరీ కన్నా యెక్కువ వున్న యే IBM System z వ్యవస్థైనా kexec/kdump మెకానిజం చేతనంగా కలిగివుంటుంది.
తగిన మెమొరీ తప్పక అందుబాటులో వుండాలి యెంచేతంటే kdump సుమారుగా 128 MB ను అప్రమేయంగా నిల్వవుంచును. ప్రత్యేకించి Red Hat Enterprise Linux 6.3 కు నవీకరణ జరుపుతున్నప్పుడు యిది చాలా ముఖ్యం. వ్యవస్థ కూలి నప్పుడు డంప్‌ను నిల్వ వుంచుటకు తగిన డిస్కు జాగా కూడా తప్పక అందుబాటులో వుండాలి. Kdump అనునది SCSI డిస్కుపై తోడ్పాటు పొందువరకు kdump అనునది DASD లేదా QETH నెట్వర్కులకు పరిమితం డంప్ పరికరాలవలె.
kdump సిద్దీకరించినప్పుడు కింది హెచ్చరిక సందేశం కనిపించవచ్చు:
..అటువంటి ఫైలు లేదా డైరెక్టరీ లేదు
ఈ సందేశం డంప్ ప్రమేయతను ప్రభావితం చేయదు దానిని విస్మరించవచ్చు. మీరు kdump ను /etc/kdump.conf, system-config-kdump, లేదా firstboot ద్వారా ఆకృతీకరించవచ్చు లేదా అచేతనం చేయవచ్చు.
ftrace కొరకు మాడ్యూల్-యాక్సెస్‌బుల్ యింటర్ఫేస్
ftrace ఫంక్షన్ ట్రేసర్ అనునది యిప్పుడు ftrace ఫంక్షన్ ట్రేసింగ్ సౌలభ్యమును వుపయోగించుటకు మాడ్యూళ్ళను మరియు వాడుకరులను అనుమతించును. అధిక సమాచారం కొరకు, కింది man పేజీలు చూడండి:
man trace-cmd-record
man trace-cmd-stack
మల్టీ-త్రెడెడ్ ప్రోసెస్‌ల ట్రేసింగ్
ఒకటి కన్నా యెక్కువ త్రెడ్సుతో ప్రోసెస్‌లను ట్రేసింగ్ చేయునప్పుడు, ltrace సౌలభ్యం అనునది ముఖ్యమైన త్రెడ్ కాక వేరే త్రెడ్‌లను ట్రేస్ చేయుటను ఖాతరు చేయదు. అయితే త్రెడ్స్ చిరునామా స్పేస్‌ను పంచుకొనుట వలన, ఆ మిగతా త్రెడ్లు ltrace చేత పంపిణీ చేయబడిన బ్రేక్‌పాయింట్లను చూడగలవు. పర్యావసానంగా, ఆ త్రెడ్లు SIGTRAP సంకేతం ద్వారా అంతం కాబడును. Red Hat Enterprise Linux 6.3 అనునది త్రెడ్-ఎవేర్‌నెట్ మరియు బ్రేక్‌పాయింట్ హాండిలింగ్ మెకానింజంను చేర్చును. సింగిల్-త్రెడెడ్ ప్రోసెస్ ట్రేసింగ్ కన్నా మల్టీ-త్రెడెడ్ ప్రోసెస్‌ల ట్రేసింగ్‌కు తోడ్పాటు యిప్పుడు దూరం.
క్రాస్ మెమొరీ యెటాచ్
క్రాస్ మెమొరీ యెటాచ్ అనునది యింట్రా-నోడ్ యింటర్-ప్రోసెస్ సంప్రదింపునకు అవసరమైన డాటా నకళ్ళను తగ్గించుటకు మెకానిజం అందించును. ప్రత్యేకించి, యిది MPI లైబ్రరీలను యింట్రా-నోడ్ సంప్రదింపు చేయుటకు అనుమతించును యెందుకంటే షేర్డ్ మెమొరీ వుపయోగించి ద్వంద నకలు సందేశం కన్నా వొంటరి నకలు సందేశం చేయుటకు. ఈ సాంకేతికత అనునది పాస్ట్ త్రూ మల్టిపుల్, యునిక్ డ్రైవర్-బేస్‌డ్ యింప్లిమెంటేషన్ల నందు నియోగించబడింది. Red Hat Enterprise Linux 6.3 నందు పరిచయం చేయబడిన యింప్లిమెంటేషన్ యీ ప్రమేయతకు సాధారణ పరిష్కారం అందించును. అదనంగా, మెమొరీ నిర్వహణ సబ్‌సిస్టమ్ నందు మార్పులు వున్నప్పుడు వాటికి సంభందించిన యింప్లిమెంటేషన్లు సవరించకుండా యీ ఫంక్షన్లను యెక్సుప్లోయిట్ చేయాలనుకొనే డివైస్ డ్రైవర్ వ్రైటర్లకు యిది అబ్‌స్ట్రాక్షన్ లేయర్ అందించును
రెండు గ్రాఫిక్స్ కార్డుల మద్య మారగల సామర్ధ్యం జతచేయబడెను
రెండు గ్రాఫిక్స్ కార్డుల మధ్య మారగల్గుటకు CONFIG_VGA_SWITCHEROO ఆకృతీకరణ ఐచ్ఛికం యిప్పుడు అప్రమేయంగా చేతనం చేయబడెను.

Chapter 2. పరికర డ్రైవర్లు

BFA డ్రైవర్ పూర్తిగా తోడ్పాటువుంది
Brocade BFA Fibre Channel మరియు FCoE driver యికపై సాంకేతిక మునుజూపు కాదు. Red Hat Enterprise Linux 6.3 నందు BFA డ్రైవర్ పూర్తిగా తోడ్పాటువుంది.
BNA డ్రైవర్ పూర్తిగా తోడ్పాటు వుంది
Brocade 10Gb PCIe ethernet నియంత్రికల కొరకు Brocade BNA డ్రైవర్ యికపై సాంకేతిక మూనుజూపు కాదు. Red Hat Enterprise Linux 6.3 నందు BNA డ్రైవర్ పూర్తిగా తోడ్పాటు వుంది.
be2net డ్రైవర్‌పై SR-IOV
Emulex be2net డ్రైవర్ యొక్క SR-IOV ప్రమేయత Red Hat Enterprise Linux 6.3 నందు సాంకేతిక మునుజూపు వలె పరిగణించబడింది. SR-IOV తోడ్పాటు యొక్క సరికొత్త వర్షన్ వుపయోగించుటకు మీరు కింది అవసరాలను కలిగివుండాలి:
  • మీరు తప్పక సరికొత్త Emulex firmware (revision 4.1.417.0 లేదా తరువాతది) నడుపాలి.
  • సేవిక సిస్టమ్ BIOS తప్పక SR-IOV ప్రమేయతను తోడ్పాటునివ్వాలి మరియు Direct I/O VT-d కొరకు వర్చ్యులైజేషన్ తోడ్పాటు కలిగివుండాలి.
  • మీరు తప్పక Red Hat Enterprise Linux 6.3 యొక్క GA వర్షన్ వుపయోగించాలి.
SR-IOV అనునది అన్ని Emulex-branded మరియు BE3-based హార్డువేర్ యొక్క OEM వేరియంట్లపై నడుచును , వీటన్నిటికీ be2net డ్రైవర్ సాఫ్టువేర్ కావాలి.
నిల్వ డ్రైవర్లు
  • Red Hat Enterprise Linux 6.3 అనునది mtip32xx డ్రైవర్ కలిగివుంది యిది Micron RealSSD P320h PCIe SSD డ్రైవులకు తోడ్పాటు కలిగివుంది.
  • Emulex Fibre Channel Host Bus Adapters కొరకు lpfc డ్రైవర్ వర్షన్ 8.3.5.68.2p కు నవీకరించబడెను.
  • mptfusion డ్రైవర్ వర్షన్ 3.04.20కు నవీకరించబడెను.
  • Broadcom Netxtreme II 57712 చిప్ కొరకు bnx2fc వర్షన్ 1.0.11 కు నవీకరించెను.
  • QLogic Fibre Channel HBAs కొరకు qla2xxx డ్రైవర్ వర్షన్ 8.04.00.02.06.3-k కు నవీకరించెను. Red Hat Enterprise Linux 6.3 కొరకు qla2xxx డ్రైవర్ నవీకరణ అనునది లక్ష్యపు పోర్టు నుండి వచ్చు క్యు-ఫుల్ స్థితి సందేశాలను సంభాలించు SCSI మిడ్-లేయర్ నందలి వుమ్మడి కోడ్ యొక్క లాభమును యిప్పుడు తీసుకొనును. ఇంతకు మునుపు, యీ కోడ్ qla2xxx డ్రైవర్ నందే వుండేది. API సారూప్యతను కలిగివుండుటకు, ql2xqfulltracking మరియు ql2xqfullrampup మాడ్యూల్ పారామితుల కొరకు స్టబ్స్ డ్రైవర్ నందే విడువటం జరిగింది.
    అదనంగా, ఈ నవీకరణ ISP82xx మరియు ISP83xx కొరకు కూడా తోడ్పాటును జతచేయును, మరియు గతిక లాగింగ్ ప్రమేయతను జతచేయును.
  • qla4xxxx అనునది వర్షన్ 5.02.00.00.06.03-k1 కు నవీకరించబడెను, ఇది port_state, port_speed, మరియు targetalias ను sysfs ఫైలు వ్యవస్థనందు ప్రదర్శించుటకు తోడ్పాటునిచ్చును.
  • megaraid డ్రైవర్ 00.00.06.14-rh1 వర్షన్‌కు నవీకరించెను.
  • IBM Power Linux RAID SCSI HBAs కొరకు ipr డ్రైవర్ నవీకరించబడెను SAS VRAID ప్రమేయాలను చేతనం చేయుటకు.
  • kdump బ్లాక్‌లిస్టు నకు పాత నియంత్రికలను జతచేయుటకు cciss డ్రైవర్ నవీకరించబడెను.
  • hpsa డ్రైవర్ వర్షన్ 2.0.2-4 కు నవీకరించబడెను kdump బ్లాక్‌లిస్టునకు పాత నియంత్రికలను జతచేయుటకు.
  • Broadcom NetXtreme II iSCSI కొరకు bnx2i డ్రైవర్ వర్షన్ 2.7.2.1 కు నవీకరించెను.
  • mpt2sas డ్రైవర్ వర్షన్ 12.101.00.00 కు నవీకరించబడెను, NUNA I/O తోడ్పాటును జతచేసెను అది HBAs యొక్క మల్టీ-రిప్లై క్యూ తోడ్పాటును వుపయోగించును.
  • కింది పరికర ఐడి జతచేయుటకు mptsas డ్రైవర్ నవీకరించబడెను: SAS1068_820XELP.
  • Brocade BFA FC SCSI డ్రైవర్ (bfa driver) నవీకరించబడెను.
  • ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరాల కొరకు be2iscsi డ్రైవర్ నవీకరించబడెను.
  • Intel DH89xxCC PCH కొరకు AHCI-mode SATA DeviceID జతచేయుటకు ahci.c డ్రైవర్ నవీకరించబడెను.
  • సరికొత్త Intel హార్డువేర్ తోడ్పాటు, విస్తరింపులు, మరియు బగ్ పరిష్కారాల కొరకు isci డ్రైవర్ వర్షన్ 1.1 కు నవీకరించబడెను.
  • isci sata డ్రైవర్ T10 DIF తోడ్పాటు జతచేయుటకు నవీకరించబడెను.
  • వివిధ బగ్స్ పరిష్కరించుటకు మరియు అనేక విస్తరింపులను జతచేయుటకు libfc, libfcoe, మరియు fcoe డ్రైవర్లు నవీకరించబడెను.
  • libsas డ్రైవర్ నవీకరించబడెను.
  • TrueScale HCAs కొరకు qib డ్రైవర్ నవీకరించబడెను.
  • వివిధ బగ్‌లను పరిష్కరించుటకు libata మాడ్యూల్ నవీకరించబడెను.
  • ఫ్లష్ తోడ్పాటును చేర్చుటకు md డ్రైవర్ యొక్క dm-raid కోడ్ నవీకరించబడెను.
  • కింది డ్రైవర్లు సరికొత్త వర్షన్‌కు నవీకరించబడెను: ahci, md/bitmap, raid0, raid1, raid10, మరియు raid456.
  • aacraid డ్రైవర్ యొక్క వర్షన్ 1.1-7[28000] కు నవీకరించబడెను.
నెట్వర్కు డ్రైవర్లు
  • NetXen Multi port (1/10) Gigabit Network కొరకు netxen డ్రైవర్ వర్షన్ 4.0.77 లేదా యెక్కువకు నవీకరించెను.
  • 578xx ఫ్యామిలీ చిప్స్ కొరకు తోడ్పాటును చేర్చుటకు bnx2x డ్రైవర్ వర్షన్ 7.2.16 కు నవీకరించెను.
  • ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్కు పరికరాల కొరకు be2net డ్రైవర్ వర్షన్ 4.2.5.0r కు నవీకరించబడెను.
  • సరికొత్త హార్డువేర్ తోడ్పాటు, విస్తరింపులు, మరియు బగ్ పరిష్కారాలను జతచేయుటకు ixgbevf డ్రైవర్ 2.2.0-k వర్షన్‌కు నవీకరించెను.
  • Chelsio Terminator4 10G Unified Wire Network Controllers కొరకు cxgb4 డ్రైవర్ నవీకరించబడెను.
  • Chelsio T3 ఫ్యామిలీ నెట్వర్కు పరికరాల కొరకు cxgb3 డ్రైవర్ నవీకరించబడెను.
  • సరికొత్త హార్డువేర్ తోడ్పాటు, విస్తరింపులు, మరియు బగ్ పరిష్కారాలను చేర్చుటకు Intel 10 Gigabit PCI Express నెట్వర్కు పరికరాల కొరకు ixgbe డ్రైవర్ వర్షన్ 3.6.7-k కు నవీకరించబడెను.
  • Intel PRO/1000 నెట్వర్కు పరికరాల కొరకు e1000e డ్రైవర్ నవీకరించబడెను.
  • Intel PRO/1000 నెట్వర్కు పరికరాల కొరకు e1000 డ్రైవర్ నవీకరించబడెను.
  • e100 డ్రైవర్ నవీకరించబడెను.
  • Cisco 10G ఈథర్నెట్ పరికరాల కొరకు enic డ్రైవర్ వర్షన్ 2.1.1.35 కు నవీకరించెను, SR-IOV తోడ్పాటు జతచేయుటకు.
  • igbvf డ్రైవర్ (Intel Gigabit Virtual Function Network driver) వర్షన్ 2.0.1-k కు నవీకరించబడెను.
  • Intel Gigabit Ethernet Adapters కొరకు igb డ్రైవర్ వర్షన్ 3.2.10-k కు నవీకరించబడెను, సరికొత్త హార్డువేర్ తోడ్పాటు, విస్తరింపులు, మరియు బగ్ పరిష్కారాలను అందించుటకు.
  • NetXtreme II 1 Gigabit Ethernet controllers కొరకు bnx2 డ్రైవర్ వర్షన్ 1.0.11 కు నవీకరించబడెను.
  • Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరాల కొరకు tg3 డ్రైవర్ వర్షన్ 3.120+ కు నవీకరించెను.
  • HP NC-Series QLogic 10 Gigabit Server Adapters కొరకు qlcnic డ్రైవర్ వర్షన్ 5.0.26 కు నవీకరించెను.
  • bna డ్రైవర్ నవీకరించెను.
  • సరికొత్త Realtek NICs (8168D/8168DP/8168E/8168EV) కొరకు తోడ్పాటు జతచేయుటకు మరియు పాత NICs విశ్వసనీయత పెంచుటకు r8169 డ్రైవర్ నవీకరించబడెను.
  • qlge డ్రైవర్ వర్షన్ 1.00.00.30కు నవీకరించెను.
  • cnic డ్రైవర్ వర్షన్ 2.5.9 కు నవీకరించబడెను, యిది bnx2x పరికరాలపై దోష వెలికితీతను మెరుగుపరచును, FCoE పారిటీ దోష వెలికితీతను జతచేయును, FCoE సెషన్ల యొక్క గరిష్ట మొత్తంను పెంచును, మరియు యితర విస్తరింపులను జతచేయును.
  • Intel Centrino Wireless-N 6235 series of Wi-Fi adapters కొరకు తోడ్పాటును జతచేయుటకు iwl6000 మరియు iwlwifi డ్రైవర్లు నవీకరించబడెను. 5GHz band ను అచేతనం చేయగల ఐచ్చికంను కూడా iwlwifi జతచేయును.
  • wireless LAN వుపవ్యవస్థ నవీకరించబడెను. ఇది dma_unmap స్థితి API ను పరిచయం చేయును మరియు కొత్త గెర్నల్ హెడర్ ఫైలును జతచేయును: include/linux/pci-dma.h.
నానావిధ డ్రైవర్లు
  • i915 డ్రైవర్ నవీకరించబడెను.
  • DRM తోడ్పాటు రీబేస్‌డ్‌తో వివిద గ్రాఫిక్స్ డ్రైవర్లు వర్షన్ 3.3-rc2 నకు నవీకరించబడెను.
  • Wacom డ్రైవర్ నవీకరించబడెను, wacompl ప్యాకేజీ ఆపేస్తోంది మరియు wdaemon ప్యాకేజీ వాడుటలేదు.
  • కొత్త చిప్‌సెట్స్ కొరకు మరియు HDA ఆడియో కోడెక్స్ కొరకు తోడ్పాటును చేతనం చేయుటకు లేదా మెరుగుపరచుటకు ALSA HDA ఆడియో డ్రైవర్ నవీకరించబడెను.
  • Broadcom BCM20702A0 single-chip బ్లూటూత్ ప్రోసెసర్ కొరకు తోడ్పాటును చేర్చుటకు btusb డ్రైవర్ నవీకరించబడెను.
  • AMD family 12h/14h/15h of CPUs కు తోడ్పాటు జతచేయుట కొరకు k10temp డ్రైవర్ hwmon వుపవ్యవస్థ నుండి నవీకరించబడెను.
  • ALPS Touchpad ప్రొటోకాల్ వర్షన్స్ 3 మరియు 4 కొరకు తోడ్పాటు జతచేయుటకు, మరియు 4-directional బటన్స్ టచ్‌పాడ్స్ కొరకు తోడ్పాటు జతచేయుటకు ALPS Touchpad డ్రైవర్ నవీకరించబడెను.
  • Enhanced Error Handling (EEH) జతచేయుటకు jsm డ్రైవర్ నవీకరించబడెను.
  • mlx4_en డ్రైవర్ వర్షన్ 2.0 కు నవీకరించబడెను.
  • mlx4_core డ్రైవర్ వర్షన్ 1.1 కు నవీకరించబడెను.

Chapter 3. నెట్వర్కింగ్

QFQ క్యూయింగ్ క్రమశిక్షణ
Red Hat Enterprise Linux 6.3 నందు, tc సౌలభ్యం Quick Fair Scheduler (QFQ) కెర్నల్ విశేషణాలతో పనిచేయుటకు నవీకరించబడెను. వాడుకరులు యిప్పుడు కొత్త QFQ ట్రాఫిక్ క్యూయింగ్ క్రమశిక్షణ లాభాన్ని యూజర్‌స్పేస్ నుండి తీసుకొనవచ్చు. ఈ విశేషణం సాంకేతిక మునుజూపు వలె పరిగణించడమైంది.
rdma_bw మరియు rdma_last సౌలభ్యాలు నిలిపివేయబడెను
rdma_bw మరియు rdma_lat సౌలభ్యాలు (perftest ప్యాకేజీ ద్వారా అందించబడినవి) యిప్పుడు నిలిపివేయబడెను మరియు భవిష్యత్తు నవీకరణనందు perftest ప్యాకేజీనుండి తీసివేయబడను. బదులుగా వాడుకరులు కింది సౌలభ్యాలను వుపయోగించాలి: ib_write_bw, ib_write_lat, ib_read_bw, మరియు ib_read_lat.

Chapter 4. వనరు(రిసోర్స్) నిర్వహణ

నెట్వర్క్ ప్రాముఖ్యతా cgroup వనరు నియంత్రిక
Red Hat Enterprise Linux 6.3 అనునది నెట్వర్కు ప్రాముఖ్యతా (net_prio) వనరు నియంత్రకిను పరిచయం చేసింది, యిది వివిధ cgroups నందలి అనువర్తనముల ప్రతి నెట్వర్కు యింటర్ఫేస్‌కు నెట్వర్కు ట్రాఫిక్ ప్రాముఖ్యతను గతికంగా అమర్చుటకు మార్గాన్నిచ్చును. అధిక సమాచారం కొరకు, Resource Management Guide చూడండి.
cgroups కొరకు OOM నియంత్రణ మరియు ప్రకటన
మెమొరీ రిసోర్స్ కంట్రోలర్ వొక Out-of-Memory (OOM) సూచకిని చేయును అది కొత్త ప్రకటన API వుపయోగించును. చేతనమైనప్పుడు (echo 1 > memory.oom_control నిర్వర్తించుట ద్వారా), వొక అనువర్తనం eventfd ద్వారా సూచించబడును OOM సంభవించినప్పుడు. OOM ప్రకటన root cgroups కొరకు పనిచేయదని గమనించండి.
కొత్త numad ప్యాకేజీ
numad ప్యాకేజీ అనునది NUMA (Non-Uniform Memory Architecture) వ్యవస్థల కొరకు డీమన్‌ను అందించును అది NUMA లక్షణాలను పర్యవేక్షించును. మాన్యువల్ స్టాటిక్ CPU పిన్నింగ్‌కు మరియు మెమొరీ అప్పగింతకు ప్రత్యామ్నాయంగా, numad అనునది మెమొరీ లేటెన్సీను తగ్గించుటకు గతిక సర్దుబాటును కాలక్రమేణా అందించును. అనువర్తనపు అత్యుత్తమ మాన్యువల్ ప్లేస్‌మెంట్ కొరకు numad డీమన్‌ను క్వరీ చేయుటకు ప్యాకేజీ వొక యింటర్ఫేస్ కూడా అందించును. numad ప్యాకేజీ అనునది సాంకేతిక మునుజూపు వలె పరిచయం చేయబండింది.

Chapter 5. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి

SSH కీల కేంద్రీయ నిర్వహణకు తోడ్పాటు
ఇంతకు మునుపు, అతిధేయి మరియు వాడుకరి SSH పబ్లిక్ కీలను కేంద్రీయంగా నిర్వహించుట సాధ్యం కాదు. Red Hat Enterprise Linux 6.3 SSH పబ్లిక్ కీ నిర్వహణను గుర్తింపు నిర్వహణ సేవికల కొరకు సాంకేతిక మునుజూపువలె జేర్చెను. గుర్తింపు నిర్వహణ క్లైంట్లపైని OpenSSH గుర్తింపు నిర్వహణ సేవిక పైన నిల్వవున్న పబ్లిక్ కీలను వుపయోగించుటకు స్వయంచాలకంగా ఆకృతీకరించబడును. SSH అతిధేయి మరియు వాడుకరి గుర్తింపులను యిప్పుడు గుర్తింపు నిర్వహణ నందు కేంద్రీయంగా నిర్వహించవచ్చు.
SELinux వాడుకరి మాపింగ్
దూరస్థ వ్యవస్థపై వాడుకరి యొక్క SELinux సందర్భం నియంత్రించు సమార్ధ్యాన్ని Red Hat Enterprise Linux 6.3 పరిచయం చేస్తోంది. SELinux వాడుకరి మాప్ నియమాలు నిర్వచించగలం మరియు, ఐచ్చికంగా, HBAC నియమాలతో కలిపివుంచగలం. వాడుకరి స్వీకరణల సందర్భమును వారు లాగిన్ అయివున్న అతిధేయిపై మరియు సమూహ సంభ్యత్వంపై ఆధారపడి యీ మాప్‌లు నిర్వచించును. గుర్తింపు నిర్వహణ బ్యాకెండ్‌తో SSSD వుపయోగించుటకు ఆకృతీకరించిన దూరస్థ అతిధేయిపై వాడుకరి లాగ్ అయినప్పుడు, వాడుకరి యొక్క SELinux సందర్భం ఆ వాడుకరి కొరకు నిర్వచించబడిన మాపింగ్ నియమాలను అనుసరించి స్వయంచాలకంగా అమర్చబడును. మరింత సమాచారం కొరకు, http://freeipa.org/page/SELinux_user_mapping చూడండి. ఈ విశేషణం సాంకేతిక మునుజూపు వలె పరిగణించడమైంది.
sshd కొరకు ధృవీకరణ యొక్క బహుళావసర పద్దతులు
ధృవీకరణ యొక్క కావలిసిన బహుళ మార్గాలను SSH యిప్పుడు అమర్చగలదు (ఇంతకు మునుపు బహుళ మార్గ ధృవీకరణను SSH అనుమతించేది వాటిలో వొకటి సఫలవంతమైన లాగిన్‌కు అవసరమయ్యేది); ఉదాహరణకు, SSH-చేతనమైన మిషన్‌కు లాగిన్ అగుటకు సంకేతపదం మరియు పబ్లిక్ కీ రెండూ ప్రవేశపెట్టవలసిన అవసరం వుండేది. సఫలవంతమైన లాగిన్‌కు అవసరమైన ధృవీకరణలను తెలుపుటకు RequiredAuthentications1 మరియు RequiredAuthentications2 ఐచ్చికాలు /etc/ssh/sshd_config ఫైలునందు ఆకృతీకరించవచ్చు. ఉదాహరణకు:
~]# echo "RequiredAuthentications2 publickey,password" >> /etc/ssh/sshd_config
ముందుతెలిపిన /etc/ssh/sshd_config ఐచ్చికాలపై మరింత సమాచారం కొరకు, sshd_config man పేజీ చూడండి.
స్వయంచాలకమౌంట్ మాప్ క్యాచింగ్ కొరకు SSSD తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.3 నందు, SSSD కొత్త సాంకేతిక మునుజూపు విశేషణం చేర్చినది: స్వయంచాలకమౌంట్ మాప్ల క్యాచింగ్‌కు తోడ్పాటు. autofs తో ఆపరేట్ చేయు పరిసరాలకు యీ విశేషణం చాలా లాభాలను అందించును:
  • LDAP సేవిక చేరుకోలేక, NFS సేవిక చేరుకోగలిగితే క్లైంట్ మిషన్ మౌంట్ కార్యక్రమాలను జరుపుటను క్యాచీడ్ స్వయంచాలకమౌంట్ మాప్స్ సలభతరం చేయును.
  • SSSD ద్వారా స్వయంచాలకమౌంట్ మాప్స్ చూడుటకు autofs డీమన్ ఆకృతీకరించినప్పుడు, వొక ఫైలు మాత్రమే ఆకృతీకరించాలి: /etc/sssd/sssd.conf. గతంలో, autofs దత్తాంశం తెచ్చుటకు /etc/sysconfig/autofs ఫైల్ ఆకృతీకరించవలసి వుండేది.
  • స్వయంచాలకమౌంట్ మాప్స్ క్యాచింగ్ అనునది క్లైంట్లపై వేగమైన పనితనంను మరియు LDAP సేవికపై తక్కువ రద్దీను చేకూర్చును.
SSSD debug_level ప్రవర్తనలో మార్పు
SSSD అనునది /etc/sssd/sssd.conf ఫైలు నందలి debug_level ఐచ్చికం యొక్క ప్రవర్తనను మార్చినది. ఇంతకు మునుపు, debug_level ఐచ్చికంను [sssd] ఆకృతీకరణ విభాగములో అమర్చుటకు సాధ్యంగా వుండేది మరియు ఫలితంగా యిది యితర ఆకృతీకరణ విభాగాలకు అప్రమేయ అమరికయ్యేది, అవి బహిర్గతంగా దీనిని వోవర్‌రోడ్ చేస్తే తప్పించి.
అంతర్గత డీబగ్ లాగింగ్ విశేషణాలకు చేసిన అనేత మార్పులు అనునవి ఐచ్చికం యెల్లప్పుడూ విడిగా ప్రతి విభాగము యొక్క ఆకృతీకరణ ఫైలునందు విధిగా తెలుపవలసిన అవసరం తెచ్చాయి, [sssd] విభాగము నుంది దాని అప్రమేయంను పొందుటకు బదులుగా.
ఫలితంగా, SSSD యొక్క సరికొత్త వర్షన్‌కు నవీకరించిన తరువాత, అదే స్థాయివద్ద వాడుకరులు డీబగ్ లాగింగ్ పొందుటకు వారు వారియొక్క ఆకృతీకరణలను నవీకరించవలసి వుంటుంది. ఒక్కో-మిషన్ ఆధారంగా SSSDను ఆకృతీకరించే వాడుకరులు వారి ఆకృతీకరణను సారూప్యమైన మార్గంలోకి నవీకరించు సాధారణ పైథాన్ సౌలభ్యం వుపయోగించవచ్చు. ఇది కింది ఆదేశమును root గా నడుపుట ద్వారా చేయవచ్చు:
~]# python /usr/lib/python2.6/site-packages/sssd_update_debug_levels.py
ఈ సౌలభ్యం కింది మార్పులను ఆకృతీకరణ ఫైలునందు చేయును: debug_level ఐచ్చికం [sssd] విభాగంనందు తెలుపబడినదో లేదో చూడుటకు పరిశీలించును. తెలుపబడితే, అది అదే స్థాయి విలువను sssd.conf ఫైలునందు దేనికైతే debug_level ఐచ్చికం తెలుపలేదో ఆ విభాగమునకు జతచేయును. ఒకవేళ debug_level ఐచ్చికం యిప్పటికే బహిర్గతంగా వేరే విభాగమునందు వుంటే, అది మార్చకుండా వదిలివేయును.
కేంద్రీయ ఆకృతీకరణ నిర్వహణ సాధనాలపై ఆధారపడే వాడుకరులు యివే మార్పులను మానవీయంగా తగిన సాధనంపై చేయవలసి వుంటుంది.
కొత్త ldap_chpass_update_last_change ఐచ్చికం
కొత్త ఐచ్చికం, ldap_chpass_update_last_change, SSSD ఆకృతీకరణకు జతచేయబడెను. ఈ ఐచ్చికం చేతనం చేయబడితే, SSSD అనునది shadowLastChange LDAP యాట్రిబ్యూట్‌ను ప్రస్తుతం సమయంకు మార్చుటకు ప్రయత్నించును. LDAP సంకేతపదం విధానం వుపయోగించినప్పుడు మాత్రమే యిది సంభందించునని గమనించండి (సాధారణంగా LDAP సేవిక చూసుకొంటుంది), అనగా, సంకేతపదం మార్చుటకు LDAP పొడిగింపు కార్యక్రమం వుపయోగించబడును. ఆ యాట్రిబ్యూట్ అనునది సంకేతపదం మార్చుతున్న వాడుకరిచే వ్రాయబడునట్లు వుండాలని గమనించండి.

Chapter 6. ఎన్‌టైటిల్‌మెంట్

RHN క్లాసిక్ నుండి ధృవీకరణపత్ర-ఆధారిత RHNకు మైగ్రేషన్
Red Hat Enterprise Linux 6.3 అనునది RHN క్లాసిక్ వినియోగదారులను ధృవీకరణపత్ర-ఆధారిత RHN కు తరలించుటకు కొత్త సాధనం కలిగివుంది. అధిక సమాచారం కొరకు, Red Hat Enterprise Linux 6 Deployment Guide. చూడండి.
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక gpgcheck ప్రవర్తన
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక అది నిర్వహించే యే రిపోజిటరీలకైనా gpgcheck ను ఖాళీ gpgkey కలిగివున్నవాటికి అచేతనం చేయును. రిపోజిటరీను పునః-చేతనం చేయుటకు, GPG కీలను అప్‌లోడ్ చేయండి, మరియు మీ వినియోగదారి విషయ నిర్వచనంకు సరైన URL జతచేసి వుండునట్లు చూసుకోండి.

Chapter 7. వర్చ్యులైజేషన్

7.1. KVM

KVM స్కేలబిలిటి విస్తరింపులు
Red Hat Enterprise Linux 6.3 నందు KVM స్కేలబిలిటీ విస్తరింపులు చేర్చబడెను:
  • గరిష్ట సమర్ధనీయ వర్చ్యువల్ అతిథి పరిమాణం 64 నుండి 160 వర్చ్యువల్ CPUల (vCPUల) వరకు పెంచబడెను.
  • KVM అతిథి నందు గరిష్ట సమర్ధనీయ మెమొరీ 512 GB నుండి 2 TB వరకు పెంచబడెను.
కొత్త Intel మరియు AMD ప్రోసెసర్స్ కొరకు KVM తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.3 నందలి KVM దీనికొరకు తోడ్పాటు కలిగివుంది:
  • Intel Core i3, i5, i7 మరియు యితర ప్రోసెసర్లు Sandy Bridge గా కోడ్ పేరు గలవి,
  • మరియు కొత్త AMD ఫ్యామిలీ 15h ప్రోసెసర్లు (కోడ్ పేరు Bulldozer).
KVM నందలి కొత్త CPU విధానం అనునది KVM అతిధేయికు మరియు వర్చ్యులైజ్డు అతిథికి తప్పనిసరైన కొత్త ప్రోసెసర్ చేతనత్వం అందించును. కొత్త ప్రోసెసర్లతో వున్న పనితనపు లాభాలను KVM వర్చ్యులైజేషన్ సంక్రమించుకొనేట్లు యిది చేయును, మరియు సరికొత్త CPUల నందలి కొత్త సూచనల ప్రయోజనాలను తీసుకొంటుంది.
KVM Steal Time తోడ్పాటు
Steal time అనగా హైపర్విజర్ వేరొక వర్చ్యువల్ ప్రోసెసర్ సేవలో వున్నప్పుడు వర్చ్యువల్ CPU వాస్తవ CPU కొరకు వేచివుండు సమయం. KVM వర్చ్యువల్ మిషన్లు యిప్పుడు steal time గణించి నివేదించగలవు,top మరియు vmstat వంటి సాధనాలచే దృశ్యనీయం, యేదైతే ఖచ్ఛితమైన CPU వినియోగ దత్తాంశంతో అతిథిని అందించునో.
KVM steal time విశేషణం CPU వినియోగం మరియు వర్చ్యుల్ మిషన్ పనితనం గురించి ఖచ్చితమైన దత్తాంశంను అతిథికి అందించును. పెద్ద మొత్తంలో steal time అనేది వర్చ్యువల్ మిషన్ పనితనంను హైపర్విజర్ చే అతిథికి అప్పజెప్పిన CPU సమయంచే తినివేయబడుతోందని సూచించును. అతిధేయిపై కొద్దిపాటి అతిథులను నడుపుట ద్వారా లేదా అతిథి యొక్క CPU ప్రాముఖ్యతను పెంచుట ద్వారా CPU పోరు వలన వచ్చు పనితనపు సమస్యలను వాడుకరి తీర్చవచ్చు. వాడుకరులు వారి అనువర్తనపు రన్-టైమ్ పనితనంను మెరుగు పరచుకోడానికి తరువాతి అంచెను తీసుకోడానికి KVM steal time విలువ వారికి దత్తాంశం అందించును.
qcow2 డిస్కు ప్రతిరూపాలకు మెరుగైన యాక్సెస్
KVM అనునది Red Hat Enterprise Linux 6.3 నందు qcow2 డిస్కు ప్రతిరూపాలకు యాక్సెస్‌ను మెరుగుపరచెను (qcow2 అప్రమేయ ఫార్మాట్) దానిని మరింత ఎసింక్రొనస్ చేయుట ద్వారా, vCPU స్టాల్స్ తప్పించుట మరియు డిస్కు I/O నందు మొత్తం పనితనం విస్తరింపచేయుట.
కొత్త qemu-guest-agent వుపప్యాకేజి
qemu-kvm అనునది qemu-guest-agent గా పిలువబడు కొత్త వుప-ప్యాకేజీ కలిగివుంది. ఈ ప్యాకేజీ సంస్థాపించి Red Hat Enterprise Linux 6.3 అతిథిలను నడుపునప్పుడు, సరిగా ఆకృతీకరించిన Red Hat Enterprise Linux 6.3 అతిధేయిలు కొత్త ఆదేశాలను అతిథికి పంపగలరు అవి: guest-sync, guest-ping, guest-info, guest-shutdown, మరియు guest-suspend-*.
అతిథి యేజెంట్‌తో సంప్రదించుటకు అతిధేయిను యెలా ఆకృతీకరించాలి అనేదానికి వుదాహరణ కొరకు, http://lists.nongnu.org/archive/html/qemu-devel/2011-07/msg00370.html చూడండి.
KVM అతిథుల నందు పనితనపు పర్యవేక్షణ
వర్చ్యువల్ మిషన్లు పనితనపు పర్యవేక్షణను వుపయోగించుట అనుమతించుటకు KVM యిప్పుడు performance monitoring unit (vPMU) ను వర్చ్యులైజ్ చేయగలదు. అదనంగా యిది Intel యొక్క architectural PMU కు తోడ్పాటునిచ్చును యేదైతే వివిధ అతిధేయి CPU వర్షన్ల నందు లైవ్-మైగ్రేట్ కాగలదో, -cpu అతిధేయ ఫ్లాగ్ వుపయోగించి.
ఈ విశేషణంతో, Red Hat వర్చ్యులైజేషన్ వినియోగదారులు యిప్పుడు పనితనపు పర్యవేక్షణను KVM అతిథుల నందు నిరంతరంగా వుపయోగించవచ్చు. వర్చ్యువల్ పనితనపు పర్యవేక్షణ విశేషణం అనునది వర్చ్యువల్ మిషన్ వాడుకరులను వారి అతిథుల నందలి పనితనపు సమస్యల మూలాలను గుర్తించుటకు అనుమతించును, అతిధేయి మరియు అతిథినందు పనిచేయు వారి అభీష్ట ప్రొఫైలింగ్ సాధనాలను వుపయోగించి. అతిధేయి నుండి KVM అతిథి ప్రొఫైల్ చేయుటకు వున్న సామర్థ్యమునకు యిది అదనం.
ఈ విశేషణం అనునది Red Hat Enterprise Linux 6.3 నందు సాంకేతిక మునుజూపు.
గతిక వర్చ్యువల్ CPU కేటాయింపు
Red Hat Enterprise Linux 6.3 నందలి KVM యిప్పుడు గతిక వర్చ్యువల్ CPU కేటాయింపు తోడ్పాటునిచ్చును, vCPU హాట్ ప్లగ్‌గా కూడా పిలువబడును, రద్దీ-లేని సమయాలలో వాటి ప్లాట్‌ఫాంలపై అనుకోని భారాల పెరుగుదలపై స్పందించుటకు మరియు గతికంగా సామర్ధ్యాన్ని నిర్వహించుటకు.
వర్చ్యువల్ CPU హాట్-ప్లగింగ్ అనునది వ్యవస్థ నిర్వహణాధికారులకు అతిథి నందు CPU వనరులను గతికంగా సర్దుబాటు చేయగల సామర్ధ్యాన్ని యిచ్చును. ఎంచేతంటే CPU వనరులను సర్దుబాటు చేయుటకు వొక అతిథి ఆఫ్‌లైన్‌గా తీసుకోబడదు, అతిథి యొక్క అందుబాటు పెంచబడును.
ఈ విశేషణం Red Hat Enterprise Linux 6.3 నందు సాంకేతిక మునుజూపు. ప్రస్తుతం, vCPU హాట్-యాడ్ ప్రమేయత మాత్రమే పనిచేయును. vCPU హాట్ అన్‌ప్లగ్ యింకా అమలుపరచలేదు.
Virtio-SCSI సామర్థ్యాలు
virtio-SCSI (SCSI పై KVM ఆధారిత నిల్వ ఆకృతి) సమార్ధ్యాల చేర్పుతో KVM వర్చ్యులైజేషన్ యొక్క నిల్వ మెరుగుపరచబడెను. Virtio-SCSI అనునది నేరుగా SCSI LUNs కు అనుసంధానమయ్యే సామర్థ్యాన్ని అందించును మరియు virtio-blk పోలిస్తే స్కేలబిలిటీను అర్ధవంతంగా మెరుగుపరచను. 25 పరికరాలను మరియు ఎగ్జాస్ట్ PCI స్లాట్స్ మాత్రమే సంభాలించగల virtio-blk తో పోలిస్తే వందలకొద్ది పరికరాలను సంభాలించగల సామర్ధ్యం కలిగివుండుట virtio-SCSI యొక్క ప్రయోజనం.
Virtio-SCSI యిప్పుడు భవిష్య లక్ష్యపు పరికర సమితిని యీ సమార్ధ్యంతో సంక్రమించుకోగలదు:
  • virtio-scsi నియంత్రిక ద్వారా వర్చ్యువల్ హార్డు డ్రైవర్ లేదా CD అనుబందించగలదు,
  • QEMU scsi-block పరికరం ద్వారా భౌతిక SCSI పరికరంను అతిధేయి నుండి అతిథికి పాస్-త్రూ చేయగలదు,
  • ఒక్కో అతిథికి వందలకొద్ది పరికరాలను వుపయోగించుటకు అనుమతించును; virtio-blk యొక్క 28-device పరిమితి నుండి మెరుగుదల.
ఈ విశేషణం Red Hat Enterprise Linux 6.3 నందు సాంకేతిక మునుజూపు.
in-guest S4/S3 states కు తోడ్పాటు
KVM యొక్క పవర్ నిర్వహణ విశేషణాలు వర్చ్యువల్ మిషన్ లోపల S4 (suspend to disk) మరియు S3 (suspend to RAM) స్థితులకు స్వాభావిక తోడ్పాటు చేర్చగలుగుటకు విస్తరింపబడెను, ఈ తక్కువ శక్తి స్థితులలోనుండి అతిధేయి రిస్టోరేషన్ వేగవంతపరచి. అంతకు ముందు అభివృద్దులలో అతిథిలు అతిథికి బహిర్గతంగా వున్న మెమొరీకు లేదా డిస్కునుండి లేదా దాయుబడుట లేదా రిస్టోర్ కావుడ జరిగెను, అది లేటెన్సీ పరిచయంచేసింది.
అదనంగా, SPICE ద్వారా దూరస్థ కీబోర్డు ఘటనల నుండి అతిథిలు S3 స్థితినుండి మేల్కొలపబడగలవు.
ఈ విశేషణం సాంకేతిక మునుజూపు మరియు Red Hat Enterprise Linux 6.3 నందు అప్రమేయంగా అచేతనంచేయబడెను. దీనిని చేతనం చేయుటకు, /usr/share/seabios/bios.bin ఫైలు కు బదులుగా /usr/share/seabios/bios-pm.bin ఫైలును VM bios కొరకు యెంపికచేయండి.
స్వాభావిక, in-guest S4 (suspend to disk) and S3 (suspend to RAM) విధ్యుత్ నిర్వహణ విశేషణాలు అతిథి నందు (అతిధేయికు వ్యతిరేకంగా) suspend to disk మరియు suspend to RAM ప్రమేయాలను జరిపే సామర్థ్యానికి తోడ్పాటు నిచ్చును, సాధారణ కీబోర్డ్ యిన్పుట్‌కు స్పందించి అతిథిని రీస్టోర్ చేయుటకు అవసరమైన సమయాన్ని తగ్గించుట ద్వారా. బహిర్గత మెమొరీ-స్టేట్ ఫైలును నిర్వహించవలసిన అవసరాన్ని కూడా తొలగించును. S3 మరియు S4 కు తోడ్పాటు నీయగల యేదేని హైపర్విజర్ పై నడిచే Red Hat Enterprise Linux 6.3 అతిథులు మరియు Windows అతిథులపై యీ సామర్ధ్యతకు తోడ్పాటు నీయబడును.
NIC కు SR-IOV తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.3 అనునది నెట్వర్కు యింటర్ఫేస్ నియంత్రికల కొరకు SR-IOV తోడ్పాటును పరిచయం చేయును. KVM అతిధేయిపైని NIC ను KVM అతిథులు పంచుకొనుటకు యీ విశేషణం అనుమతించును. SR-IOV పై మరింత సమాచారం కొరకు, Chapter 13. SR-IOV Virtualization Host Configuration and Guest Installation Guide చూడండి. be2net డ్రైవర్ పైని SR-IOV పై సమాచారం కొరకు, Chapter 2, పరికర డ్రైవర్లు చూడండి.
AMD-V కొరకు KVM నందు TSC స్కేలింగ్
AMD Virtualization (AMD-V) కొరకు KVM కు Red Hat Enterprise Linux 6.3 అనునది Time Stamp Counter (TSC) స్కేలింగ్ జతచేసెను. ఇచ్చిన TSC తరచుదనాన్ని KVM అతిథిపై యెమ్యులేట్ చేయగల సమార్థ్యం యీ విశేషణానికి వుంది.
perf-kvm కొరకు తోడ్పాటు
perf-kvm సాధనం కొరకు తోడ్పాటు, అతిధేయి నుండి అతిథి పనితనంను పర్యవేక్షించిగల సమార్థ్యం అందించునది, జతచేయబడెను. అధిక సమాచారం కొరకు perf-kvm man పేజీ చూడండి.

7.2. SPICE

USB 2.0 రీడైరెక్షన్ తోడ్పాటు
KVM USB 2.0 host adapter పై Spice builds యెమ్యులేషన్ తోడ్పాటు, మరియు దూరస్థ USB రీడైరెక్షన్ తోడ్పాటును చేతనం చేయును అది సేవికల పై నడిచే వర్చ్యువల్ మిషన్లు క్లైంట్ వైపున దూరస్థంగా ప్లగ్ చేసిన USB పరికరాలను వుపయోగించుటకు అనుమతించును.

7.3. libvirt

పైన/కింద లింకు స్థితులను నియంత్రించుట
అతిథి వర్చ్యువల్ నెట్వర్కు యింటర్ఫేసు యొక్క లింక్ (up లేదా down) స్థితిని (libvirt యిప్పుడు నియంత్రించగల సమార్ధ్యం కలిగివుంది. ఇంటర్ఫేస్ నుండి నెట్వర్కు వైరును గుచ్చుట లేదా తీసివేయుట ద్వారా వాడుకరులను పరీక్షలు జరుపుటకు అనుమతించును. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ విశేషణం ద్వారా వాడుకరులు అతిథుల్ని యేకం చేయగలరు.
సరికొత్త Intel మరియు AMD ప్రోసెసర్స్ కొరకు తోడ్పాటు జతచేసెను
Red Hat Enterprise Linux 6.3 నందు, సరికొత్త Intel Core i3, i5, i7 మరియు యితర Intel ప్రోసెసర్స్, మరియు ఫ్యామిలీ 15h మైక్రోఆర్కిటెక్చర్ AMD ప్రోసెసర్స్ తోడ్పాటు కొరకు libvirt నవీకరించబడెను. ఈ నవీకరణతో, libvirt యీ ప్రోసెసర్ల నందలి కొత్త విశేషణాలను వినియోగించుకోగలదు.

Chapter 8. క్లస్టరింగ్ మరియు అదిక అందుబాటు

నిర్వహణ UI విస్తరింపులు
Luci, క్లస్టర్లను ఆకృతీకరించుటకు వెబ్-ఆధారిత నిర్వహణ UI, కింది వాటిని చేర్చుటకు నవీకరించబడెను:
  • క్లస్టర్డ్ సేవను తీసివేయునప్పుడు వొక నిర్థారణ డైలాగ్ పెట్టె కనిపించును.
  • UI మెరుగైన పునఃప్రారంభ ప్రతిమను చేర్చును.
  • చైల్డ్ వనరు జతచేయి బటన్ సరళీకరించబడెను.
  • UI నుండి డీబగ్గింగ్‌ను చేతనం చేయుటకు వొక ఐచ్చికం జతచేయబడెను.
క్రియాహీన luci ధృవీకృత సెషన్ల స్వయంచాలక కాలాంతం
Red Hat Enterprise Linux 6.2 వరకు, luci ధృవీకృత సెషన్లు 15 నిముషాల క్రియాహీనత తరువాత స్వయంచాలకంగా కాలాంతమయ్యేవి. ఈ కాలాన్ని యిప్పుడు /etc/sysconfig/luci ఫైల్ నందలి who.auth_tkt_timeout పారామితిని సవరించుట ద్వారా ఆకృతీకరించుకొనవచ్చు.
కొత్త libqb ప్యాకేజీ
libqb ప్యాకేజీ వొక లైబ్రరీ అందించును దాని ప్రాధమిక ప్రయోజనం అధిక పనితనపు క్లైంట్ సర్వర్ పునఃవుపయోగ విశేషణాలను, అధిక పనితనపు లాగింగ్, ట్రేసింగ్, యింటర్-ప్రోసెస్ కమ్యునికేషన్, మరియు పోలింగ్ వంటివి అందించుట. ఈ ప్యాకేజీ అనునది pacemaker ప్యాకేజీ యొక్క ఆధారంగా పరిచయంచేయబడింది, మరియు Red Hat Enterprise Linux 6.3 నందు సాంకేతిక మునుజూపు వలె పరిగణించబడింది.
Pacemaker యిప్పుడు libqb లాగింగ్ వుపయోగించును
కొత్తగా జతచేసిన libqb ఆధారం మూలంగా, pacemaker యిప్పుడు దాని లాగింగ్ ప్రమేయతను తక్కువ వెర్బోసిటీను అందించుటకు వుపయోగించును అదేవిధంగా pacemaker డీబగ్ చేయు మరియు తోడ్పాటు నిచ్చు సామర్ధ్యంను కలిగివుంటుంది.
inter-node లాకింగ్ కొరకు CPG API వినియోగించుట
Rgmanager వొక విశేషణం కలిగివుంది అది దాన్ని inter-node లాకింగ్ కొరకు Corosync యొక్క Closed Process Group (CPG) API వినియోగించుటకు చేతనంచేయును. Corosync యొక్క Redundant Ring Protocol (RRP) విశేషణం చేతనం కాగానే యీ విశేషణం కూడా చేతనమౌను. Corosync యొక్క RRP విశేషణం పూర్తిగా తోడ్పాటునిచ్చు దానివలె పరిగణించడమైంది. ఏమైనప్పటికీ, మిగతా అధిక-అందుబాటు పొడిగింతలతో వుపయోగించునప్పుడు, యిది సాంకేతిక మునుజూపుగా పరిగణించడమైంది.

Chapter 9. నిల్వ

LVM తోడ్పాటు (క్లస్టర్-కాని) thinly-provisioned స్నాప్‌షాట్ల కొరకు
కొత్త LVM copy-on-write (cow) స్నాప్‌షాట్లు Red Hat Enterprise Linux 6.3 నందు సాంకేతిక మునుజూపు వలె అందుబాటులో వున్నాయి. ఈ యింప్లిమెంటేషన్ యొక్క ముఖ్య ప్రయోజనం, గత స్నాప్‌షాట్ల యింప్లిమెంటేషన్‌తో పోల్చితే, అది వొకే దత్తాంశ వాల్యూమ్ నందు బహుళ వర్చ్యువల్ పరికరాలను నిల్వ వుంచుటకు అనుమతించును. రికర్సివ్ స్నాప్‌షాట్ల (స్నాప్‌షాట్ల యొక్క స్నాప్‌షాట్ల యొక్క స్నాప్‌షాట్లు ...) యొక్క ఆర్బిటరీ డెప్త్ కొరకు యీ యింప్లిమెంటేషన్ తోడ్పాటును అందించును.
ఒంటరి-వ్యవస్థ పై వుపయోగించుటకు యీ విశేషణం. క్లస్టర్ పరిసరాలనందు బహుళ-వ్యవస్థ యాక్సెస్ కొరకు యిది అందుబాటులో వుండదు.
అధిక సమాచారం కొరకు, -s/--snapshot ఐచ్చికం యొక్క పత్రకీకరణను lvcreate man పేజీ నందు చూడండి.
LVM తోడ్పాటు (క్లస్టర్డ్-కాని) thinly-provisioned LVs కొరకు
అనువర్తనములకు అవసరమైనప్పుడు అర్బిటరీ పరికరాలకు కేటాయించుటకు ఖాళీ జాగా నిల్వ పూల్‌ను నిర్వహించగల వెసులుబాటును Logical Volumes (LVs) కలిగివున్నాయి. ఒక అనువర్తనం యథార్ధంగా పూల్‌నకు వ్రాయునప్పుడు కేటాయించుటకు బందనమగు పరికరాల సృష్టీకరణకు యిది అనుమతించును. నిల్వ జాగా యొక్క కాస్ట్-యెఫెక్టివ్ కేటాయింపు అవసరమైనప్పుడు కొద్ది-వెసులుబాటు గల పూల్‌ గతికంగా విస్తరింపచేయవచ్చు. Red Hat Enterprise Linux 6.3 నందు, యీ విశేషణం సాంకేతిక మునుజూపు వలె పరిచయం చేయడమైంది. ఈ విశేషణం ప్రయత్నించుటకు మీరు తప్పక device-mapper-persistent-data ప్యాకేజీ కలిగివుండాలి. అదిక సమాచారం కొరకు, lvcreate man పేజీ చూడండి.
LVM metadata ను lvmetad ద్వారా గతికంగా మొత్తంచేయడం
చాలా LVM ఆదేశాలకు వ్యవస్థపైని డిస్కుప పరికరాలనందు నిల్వవున్న LVM మెటాడాటా యొక్క ఖచ్ఛితమైన దర్శనం కావాలి. ప్రస్తుత LVM రూపొందికతో, యీ సమాచారం అందుబాటులో లేకపోతే, వ్యవస్థ నందలి అన్ని భౌతిక డిస్కు పరికరాలను LVM తప్పక స్కాన్ చేయాలి. పెక్కు సంఖ్యలో డిస్కులను కలిగివున్న వ్యవస్థలనందు దీనికి పెద్ద మొత్తలో I/O ఆపరేషన్లు అవసరమగును.
పరికరం యొక్క స్థితి మారిన ప్రతిసారి మెటాడాటా సమాచారం మొత్తం సముదాయపరచి తద్వారా యీ స్కానింగ్ తొలగించుటమే lvmetad డీమన్ యొక్క ప్రయోజనం. ఈ ఘటనలు lvmetad కు udev నియమాల ద్వారా సంకేతమిచ్చును. ఒక వేళ lvmetad నడువక పోతే, LVM అది సాధారణంగా చేయునట్లే స్కాన్ నడుపును.
ఈ విశేషణం సాంకేతిక మునుజూపు వలె అందించబడును మరియు యిది Red Hat Enterprise Linux 6.3 నందు అప్రమేయంగా అచేతనం చేయబడివుండును. దీనిని చేతనం చేయుటకు, use_lvmetad పారామితిని /etc/lvm/lvm.conf ఫైలునందు చూడండి, మరియు lvmetad డీమన్‌ను lvm2-lvmetad init స్క్రిప్టు ఆకృతీకరించుట ద్వారా చేతనం చేయుము.
Fiber Channel over Ethernet (FCoE) లక్ష్యపు రీతికి పూర్తి తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.3 అనునది Fiber Channel over Ethernet (FCoE) లక్ష్యపు రీతినకు తోడ్పాటును చేర్చును. ఈ కెర్నల్ విశేషణం అనునది targetcli సౌలభ్యం ద్వారా ఆకృతీకరించదగునది, fcoe-target-utils ప్యాకేజీ ద్వారా పంపిణీ చేయబడును. FCoE అనునది నెట్వర్కు తోడ్పాటుగల Data Center Bridging (DCB) నందు వుపయోగించుటకు రూపొందించబడెను. మరిన్ని వివరాలు dcbtool(8) and targetcli(8) man పేజీల నందు అందుబాటులో వున్నాయి (lldpad మరియు fcoe-target-utils ప్యాకేజీల ద్వారా అందించబడిన).
LVM RAID పూర్తి తోడ్పాటు
విస్తరిత RAID తోడ్పాటు LVM నందలిది యిప్పుడు Red Hat Enterprise Linux 6.3 నందు పూర్తిగా తోడ్పాటు నిచ్చుచున్నది. LVM యిప్పుడు RAID 4/5/6 లాజికల్ వాల్యూమ్స్ సృష్టించగలదు మరియు యీ లాజికల్ వాల్యూమ్స్ మిర్రరింగ్‌కు తోడ్పాటునిచ్చును. ఈ కొత్త విశేషణాలకు MD (software RAID) మాడ్యూళ్ళు బాకెండ్ తోడ్పాటును అందించును.
వాల్యూమ్‌లను చదువుట-మాత్రమే రీతినందు క్రియాశీలపరచుట
కొత్త LVM ఆకృతీకరణ ఫైల్ పారామితి, activation/read_only_volume_list, చదువుట-మాత్రమే రీతినందు ఫలానా వాల్యూమ్‌లను యెల్లప్పుడూ క్రియాశీలపరచుటకు సాధ్యం చేయును, వాస్తవానికి ఆ వాల్యూమ్‌ల యొక్క అనుమతులపై ఆధారపడకుండా. ఈ పారామితి మెటాడాటా నందు వున్న --permission rw ఐచ్చికంను వోవర్‌రైడ్ చేయును.

Chapter 10. సాధారణ నవీకరణలు

సాఫ్టువేర్ సంకలనాల సౌలభ్యాలు
Red Hat Enterprise Linux 6.3 అనునది scl-utils ప్యాకేజీను చేర్చెను యిది రన్‌టైమ్ సౌలభ్యం అందించును మరియు ప్యాకేజింగ్ మాక్రోలను సాఫ్టువేర్ సంకలనాల ప్యాకేజింగ్ కొరకు అందించును. సాఫ్టువేర్ సంకలనాలు వాడుకరులను అదే RPM ప్యాకేజీల వివిధ వర్షన్లను వ్యవస్థనందు సంస్థాపించుటకు అనుమతించును. scl సౌలభ్యత వుపయోగించి, వాడుకరులు /opt డైరెక్టరీనందు సంస్థాపించిన RPMల ఫలానా వర్షన్లను చేతనం చేయవచ్చు. సాఫ్టువేర్ సంకలనాలపై అధిక సమాచారం కొరకు,Software Collections Guide. చూడండి.
MySQL InnoDB చొప్పింత
Red Hat Enterprise Linux 6.3 అనునది MySQL InnoDB నిల్వ యింజన్‌ను చొప్పింతవలె AMD64 మరియు Intel 64 ఆకృతుల కొరకు అందించును. అంతర నిర్మిత built-in InnoDB నిల్వ యింజన్ కన్నా యీ చొప్పింత అదనపు విశేషణాలను మరియు వుత్తమ పనితనంను అందించును.
OpenJDK 7
Red Hat Enterprise Linux 6.3 అనునది OpenJDK 7 ను సాంకేతిక మునుజూపు వలె అందించును, పూర్తి-తోడ్పాటు వున్న OpenJDK 6 కు ప్రత్యామ్నాయంగా.
New Java 7 ప్యాకేజీలు
java-1.7.0-oracle మరియు java-1.7.0-ibm ప్యాకేజీలు యిప్పుడు Red Hat Enterprise Linux 6.3 నందు అందుబాటులో వున్నాయి.
initscripts ద్వారా NIS డొమైన్ పేరు అమర్చుట
NIS డొమైన్ పేరు అమర్చుటకు వాడుకరులను అనుమతించుటకు initscripts ప్యాకేజీ నవీకరించబడెను. NISDOMAIN పారామితిని /etc/sysconfig/network ఫైలు నందు ఆకృతీకరించుట ద్వారా యిది జరిగినది.
logrotate కొరకు ACL తోడ్పాటు
ఇంతకు మునుపు, ACLs ద్వారా అన్ని లాగ్‌లను యాక్సెస్ చేయుటకు ఫలానా సమూహాలు అనుమతించబడినప్పుడు, లాగ్‌లు భ్రమణం చెందినప్పుడు యీ ACLs తొలగించబడెను. Red Hat Enterprise Linux 6.3 నందు, logrotate సౌలభ్యం ACLs తోడ్పాటు నిచ్చును, భ్రమణం చెందిన లాగ్‌లు ACL అమరికలను కలిగివుండును.
wacomcpl ప్యాకేజీ తీసివేయబడెను
wacomcpl ప్యాకేజీ నిలిపివేయబడెను మరియు ప్యాకేజీ సమతి నుండి తొలగించబడెను. wacomcpl ప్యాకేజీ అనునది Wacom టాబ్లెట్ అమరికల గ్రాఫికల్ ఆకృతీకరణను అందించును. ఈ ప్రమేయత యిప్పుడు GNOME Control Center లోనికి సమైఖ్యమైను.
నవీకృత NumPy ప్యాకేజీ
ఆర్బిటరీ రికార్డ్స్ యొక్క పెద్ద మల్టీ-డైమెన్షనల్ యెరేస్ మేనిప్యులేట్ చేయుటకు రూపొందించిన NumPy ప్యాకేజీ వర్షన్ 1.4.1 కు నవీకరించబడెను. ఈ నవీకృత వర్షన్ యీ మార్పులను కలిగివుంది:
  • 0-d యెరేలపై ఆపరేట్ చేయునప్పుడు, numpy.max మరియు యితర ఫంక్షన్లు కింది పారామితులను మాత్రమే ఆమోదించును: axis=0, axis=-1, మరియు axis=None. out-of-bounds అక్షాలు వుపయోగించుట bug సూచించును, దైనికైతే NumPy యిప్పుడు దోషం యిస్తోందో.
  • axis > MAX_DIMS పారామితి తెలుపుట అనుమతించబడదు; axis=None తెలిపినప్పుడు ప్రవర్తించినట్టు ప్రవర్తించుట కన్నా, NumPy యిప్పుడు దోషం లేవనెత్తును.
Rsyslog అనునది ముఖ్య వర్షన్ 5 కు నవీకరించబడెను
rsyslog ప్యాకేజీ ముఖ్య వర్షన్ 5 కు నవీకరించబడెను. ఈ నవీకరణ వివిధ విస్తరింపులను మరియు బహుళ బగ్ పరిష్కారాలను కలిగివుంది. కిందివి అతి ముఖ్యమైన మార్పులు:
  • $HUPisRestart డైరెక్టివ్ తీసివేయబడెను మరియు తోడ్పాటు నీయటులేదు. పునఃప్రారంభ-రకం HUP ప్రోసెసింగ్ అందుబాటులో లేదు. ఇప్పుడు, SIGHUP సంకేతం స్వీకరించబడినప్పుడు, అవుట్‌పుట్స్ (చాలా సందర్భాలలో లాగ్ ఫైళ్ళు)మాత్రమే తెరువబడును లాగ్ భ్రమణం తోడ్పాటుకు.
  • spool ఫైళ్ళ ఫార్మాట్ (ఉదాహరణకు, disk-assisted queues) మారెను. కొత్త ఫార్మాట్‌కు మారుటకు, spool ఫైళ్ళు నిర్వీర్యం చేయండి, ఉదాహరణకు, rsyslogd మూసివేయుట ద్వారా. అప్పుడు, Rsyslog నవీకరణతో కొనసాగండి, మరియు rsyslogd ను మరలా ప్రారంభించండి. ఒకసారి నవీకరించిన తరువాత, కొత్త ఫార్మాట్ స్వయంచాలకంగా వుపయోగించబడును.
  • rsyslogd డీమన్ డీబగ్ రీతినందు నడుచునప్పుడు (-d ఐచ్చికం వుపయోగించి), అది ఫోర్‌గ్రౌండ్ నందు నడిచెను. ఇది పరిష్కరించబడెను మరియు డీమన్ యిప్పుడు ఫోర్క్ చేయబడెను మరియు బ్యాక్‌గ్రౌండ్ నందు నడుచును, అనుకున్నట్లుగా.
Rsyslog యా వర్షన్ నందు వచ్చిన మార్పులపై మరింత సమాచారం కొరకు, http://www.rsyslog.com/doc/v5compatibility.html చూడండి.

పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

Revision History
Revision 1-0Wed Jun 20 2012Martin Prpič
Red Hat Enterprise Linux 6.3 విడుదల నోట్స్ యొక్క విడుదల.
Revision 0-0Tue Apr 24 2012Martin Prpič
Red Hat Enterprise Linux 6.౩ బీటా విడుదల నోట్స్ యొక్క విడుదల.